My Pages

7, అక్టోబర్ 2024, సోమవారం

ANM Gr-III వారికి ఇతర పనులకు పంచాయతీ వారు వాడకుండా వారి సేవలు ఆరోగ్యమందిర్ లో ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులకు పంచాయతీలకు అదేశములు

గ్రామ వార్డ్ సచివాలయం లోని ANM Gr-III వారికి ప్రమోషన్ కొరకు ఉత్తర్వులు

Seniority List 
ANM Gr-III నుండి MPHA (F) కు ప్రమోషన్లు కొరకు టైం షెడ్యూల్ మరియు విధి విధానములు

ప్రధాన సూచనలు:

💥 15.10.2024 నాటికి ANM Gr-III ల సీనియారిటీ జాబితాలు ప్రచురించాలి.

💥 18.10.2024 నాటికి అభ్యంతరాలను పిలవాల మరియు 21.10.2024 నాటికి పరిష్కరించాలి.

💥 22.10.2024 నాటికి తుది సీనియారిటీ జాబితాలు అందుబాటులో ఉండాలి.

💥 22.10.2024 నాటికి MPHA (F) ఖాళీలను ప్రదర్శించాలి.

💥 నియమిత కమిటీతో కౌన్సెలింగ్ ద్వారా ప్రమోషన్లు నిర్వహించాలి.

💥 అర్హులైన అభ్యర్థులకు ప్రస్తుత నియమంలోనే ప్రమోషన్ ఆర్డర్లు అందించాలి. క్షేత్ర స్థాయిలో పనికి అంతరాయం కలగకుండా ప్రస్తుతం పని చేస్తున్న చోటే వారిని కొనసాగించాలి.

💥  జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారులకు సమాచారం
రాష్ట్రంలోని అన్ని జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారులకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించబడింది.
💥 ఈ సమాచారాన్ని అన్ని కలెక్టర్లు మరియు జిల్లా మేజిస్ట్రేట్లకు తెలియజేయాలి.

ప్రత్యేక ముఖ్య కార్యదర్శి, ఆరోగ్య మరియు కుటుంబ సంక్షేమ విభాగానికి కాపీ పంపించాలి.

30, సెప్టెంబర్ 2024, సోమవారం

ANM Gr-III వారికి ఇతర పనులకు పంచాయతీ వారు వాడకుండా వారి సేవలు ఆరోగ్యమందిర్ లో ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
జి. ఓ నెంబర్ 124 ప్రకారం ( 30/09/2024) ,

 "గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సెక్రటరీ ప్రకారం" 

1) ప్రతీ విలేజ్ క్లినిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా పరిగణించబడతాయి. 

2) దీంట్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (CHO / MLHP) తో పాటు సచివాలయం ANM Gr-III, ఇతర ANM లు, ఆశాలు కలిసి కోర్డినేషన్ తో పని చేయాల్సి ఉంటుంది. 

3) వీరి టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు .

4) వీరి టైమింగ్ ని ఇతర సచివాలయం సిబ్బంది లాగా ఉదయం పది గంటల నుండి కాకుండా, 9 గంటల నుండి 4 గంటల వరకు పరిగణించబడుతుంది.

5) సచివాలయం లో ఉంటున్న ANM లు అందరూ ఇక పై విలేజ్ క్లినిక్స్ నుండే తప్పకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

6) PHC మెడికల్ ఆఫీసర్ గారి ఆర్డర్స్ ప్రకారం వీరు పనిచేయాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ గారు ప్రతీ నెలా satisfactory లెటర్ ఇచ్చిన తరువాతే జీతాలు ఇతర బిల్లులు  ప్రాసెస్ చేయబడతాయి .

7) సచివాలయం ANM ఇతర ANM మరియు ఆశాలు ప్రతీ రోజూ మధ్యానం 2 నుండి 4 వరకు PGRS (పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ కి హాజరు కావాల్సి ఉంటుంది, విలేజ్ క్లినిక్స్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో పాటు. దీని ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని పనిచేసేందుకు వీలు ఉంటుంది.

8)గ్రామ వార్డు సచివాలయం DDO లు,ఇతర సిబ్బంది వీరికి ఎటువంటి ఇతర పని చెప్పకూడదు. 

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సెక్రటరీ ఆదేశాలు. 


వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 28.09.2024 | MR 2 | MR 1 | BCG to Penta 3

 

మిమ్మల్ని టార్గెట్ చేస్తున్నారు అనుకునే వాళ్ళు దయచేసి చూడకండి. 





Pending Counts Check Here

MR 2 MR 1 BCG to Penta 3


వాక్సిన్ పెండింగ్ లిస్ట్ 28.09.2024 


👉 MR - 1 పెండింగ్ లిస్ట్ కొరకు 


👉 MR - 2 పెండింగ్ లిస్ట్ కొరకు 


👉 BCG - Penta-3 పెండింగ్ లిస్ట్ కొరకు 



తప్పుగా DPT, Hep-B, JE వాక్సిన్ నమోదు చేసిన లిస్ట్ ANMs

మీకు MR - 1 & 2 ఎప్పుడు బిడ్డకి చేయాలో  తెలుసా ?


MR - 1 : 9 నెలలు నిండగానే (275 రోజుల తరవాత)

MR - 2 : 16 నెలలు నిండగానే (485 రోజుల తరవాత)



23, సెప్టెంబర్ 2024, సోమవారం

ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లి పాస్ అయిన వారి సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ కొరకు



 ANM నుంచి GNM ట్రైనింగ్ కి వెళ్లి పాస్ అయిన వారి సర్టిఫికెట్ రిజిస్ట్రేషన్ వెంటనే పైన తెలిపిన విధంగా అన్ని తీసుకొని విజయవాడ APNMC నందు రిజిస్ట్రేషన్ చేయించుకోగలరు 


ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదుపరి  లిస్ట...