My Pages

30, సెప్టెంబర్ 2024, సోమవారం

ANM Gr-III వారికి ఇతర పనులకు పంచాయతీ వారు వాడకుండా వారి సేవలు ఆరోగ్యమందిర్ లో ఉపయోగించుకునే విధంగా ప్రభుత్వ ఉత్తర్వులు

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం
జి. ఓ నెంబర్ 124 ప్రకారం ( 30/09/2024) ,

 "గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సెక్రటరీ ప్రకారం" 

1) ప్రతీ విలేజ్ క్లినిక్ ఆయుష్మాన్ ఆరోగ్య మందిర్ గా పరిగణించబడతాయి. 

2) దీంట్లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్స్ (CHO / MLHP) తో పాటు సచివాలయం ANM Gr-III, ఇతర ANM లు, ఆశాలు కలిసి కోర్డినేషన్ తో పని చేయాల్సి ఉంటుంది. 

3) వీరి టైమింగ్స్ ఉదయం 9 గంటల నుండి సాయంత్రం 4 గంటల వరకు .

4) వీరి టైమింగ్ ని ఇతర సచివాలయం సిబ్బంది లాగా ఉదయం పది గంటల నుండి కాకుండా, 9 గంటల నుండి 4 గంటల వరకు పరిగణించబడుతుంది.

5) సచివాలయం లో ఉంటున్న ANM లు అందరూ ఇక పై విలేజ్ క్లినిక్స్ నుండే తప్పకుండా విధులు నిర్వహించాల్సి ఉంటుంది.

6) PHC మెడికల్ ఆఫీసర్ గారి ఆర్డర్స్ ప్రకారం వీరు పనిచేయాల్సి ఉంటుంది. మెడికల్ ఆఫీసర్ గారు ప్రతీ నెలా satisfactory లెటర్ ఇచ్చిన తరువాతే జీతాలు ఇతర బిల్లులు  ప్రాసెస్ చేయబడతాయి .

7) సచివాలయం ANM ఇతర ANM మరియు ఆశాలు ప్రతీ రోజూ మధ్యానం 2 నుండి 4 వరకు PGRS (పబ్లిక్ గ్రీవెన్స్ సిస్టమ్ కి హాజరు కావాల్సి ఉంటుంది, విలేజ్ క్లినిక్స్ లో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్ తో పాటు. దీని ద్వారా ప్రజల సమస్యలు తెలుసుకొని పనిచేసేందుకు వీలు ఉంటుంది.

8)గ్రామ వార్డు సచివాలయం DDO లు,ఇతర సిబ్బంది వీరికి ఎటువంటి ఇతర పని చెప్పకూడదు. 

గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, చీఫ్ సెక్రటరీ ఆదేశాలు. 


కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి