My Pages

23, జూన్ 2025, సోమవారం

గ్రామ వార్డు సచివాలయంలో నేటివ్ మండల బదిలీ పైన వచ్చిన క్లారిటీ

గ్రామ వార్డు సచివాలయంలో నేటివ్ మండల బదిలీ పైన వచ్చిన క్లారిటీ 

పట్టణం లో మాత్రమే నేటివ్ వార్డు నుంచి పక్క వార్డు లోని సచివాలయానికి మారవచ్చు

రూరల్ వారు తప్పనిసరిగా పక్కా మండలానికి మరవలసిందే.

4, జూన్ 2025, బుధవారం

MPHA ( F) బదిలీ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక సూచనలు – ఉత్తర్వులు జారీ.

👉Transfer Application Form


ఆంధ్రప్రదేశ్ ఆరోగ్య, కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం నుండి జారీచేసిన అధికారిక ఉత్తరం (Rc.No.2851586) యొక్క తెలుగు అనువాదం:
---

ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం:: ఏపీ :: మంగళగిరి
Rc.No.2851586/HMF04-11021(31)/ 68/ 2025-EST SEC-CHFW తేదీ: 04-06-2025

విషయం:

ఆరోగ్య కుటుంబ సంక్షేమ – ఉద్యోగుల బదిలీలు మరియు పోస్టింగ్‌లు – రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు తెలియజేత – MPHA (F) కేడర్ సంబంధించి బదిలీ నిషేధం ఎత్తివేయబడిన నేపథ్యంలో కొన్ని ప్రత్యేక సూచనలు – ఉత్తర్వులు జారీ.

సూచనలు:

1. పై సూచనల ఆధారంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు (DM&HOలు) MPHA (F) బదిలీలను కింది విధంగా చేపట్టాలి:

సాధారణ మార్గదర్శకాలు:

1. జిల్లా కేంద్రాల్లో బదిలీలను పారదర్శకంగా, పరిపాలన పరంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు కింది క్రమాన్ని పాటించాలి:

స్పష్ట ఖాళీలు (Clear Vacancies) అంటే:

PHC ప్రధాన కార్యాలయం/సబ్ సెంటర్ ఖాళీలు – ప్రస్తుతం ఉద్యోగి లేని పోస్టులు

విల్లేజ్ హెల్త్ క్లినిక్స్ (VHCs) కలిసిన సబ్ సెంటర్లు – సిబ్బంది లేని ఖాళీలు

పై రెండు రకాలే స్పష్ట ఖాళీలుగా పరిగణించాలి. ఇతర ఖాళీలు స్పష్ట ఖాళీలుగా పరిగణించరాదు.

2. ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలి – వారు ఎక్కడైనా ఐదేళ్లు ఆపాదించిన సేవ గణనలోకి తీసుకోవాలి.

3. 2025 మే 31 నాటికి రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు మాత్రమే అభ్యర్థన బదిలీలకు అర్హులు.

4. 5 సంవత్సరాల స్టేషన్ సీనియారిటీ కలిగి, దర్యాప్తు / ఏసీబీ / విజిలెన్స్ కేసులు ఉన్నవారు – వారికి నాన్ ఫోకల్ పోస్టులో బదిలీ ఇవ్వాలి.

5. ఇతర విభాగాలకు / కార్యాలయాలకు నియమించబడిన MPHA (F) – వారి జీతాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో అదే స్టేషన్ బదిలీ కోసం పరిగణించాలి. వారికి బదిలీ కావాలంటే అభ్యర్థన అవసరం. లేనిచో, వారు అదే స్థలంలో కొనసాగించాలి.

6. బదిలీ కోరుతున్న ఉద్యోగులు 5 ప్రాధాన్యత స్థలాలు ఇవ్వాలి. ఒక స్థలానికి ఎక్కువమంది కోరితే, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా ఎంపిక చేయకపోతే ఖాళీల ఆధారంగా పోస్టింగ్ ఇవ్వబడుతుంది. ప్రతి గ్రామీణ ఆరోగ్య కేంద్రం మరియు హెడ్ క్వార్టర్ సబ్ సెంటర్లో కనీసం ఒక MPHA (F) ఉండేలా చూడాలి.

7. పై విధానాల ప్రకారం బదిలీ అయిన ఉద్యోగులు 23.06.2025 నాటికి తొలగించబడ్డవారిగా పరిగణించబడతారు.

8. ప్రతి సబ్ సెంటర్ మరియు గ్రామ/వార్డ్ సెక్రటేరియట్‌లో కనీసం ఒక MPHA (F) లేదా ANM Grade III ఉండాలి – ప్రజారోగ్య సేవల్లో అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇది తప్పనిసరి.

15, ఏప్రిల్ 2025, మంగళవారం

RCH Portal 2025-26 సూచనలు | ANMs అందరు తప్పక పాటించవలసిన సూచనలు | April 2025 Instructions

 

RCH Portal Instructions 2025 - 26

1. Profile Update:

  • RCH Portal లో Village ని సెట్ లొకేషన్ చేసి తప్పనిసరిగా ఏప్రిల్ 1 వ తేదీన Village ప్రొఫైల్ నందు Financial Year  దగ్గర 2025-26 ని సెలెక్ట్ చేసుకోవాలి. 
  • Village ప్రొఫైల్ నందు ANM, ASHA & AWW ఎవరు సేవలు అందిస్తారో వారి పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి. 
  • సెలెక్ట్ చేసిన తరువాత ఆ గ్రామ / వార్డ్ యొక్క పాపులేషన్, EC, ANC & Child సంవత్సరపు టార్గెట్ (ELA) ని నమోదు చేసి సేవ్ చేయాలి.
  • ఆ గ్రామ / వార్డ్ దగ్గరగా ఉన్న ఆరోగ్యకేంద్రం వివరములు నమోదు చేయాలి. 
  • Village ప్రొఫైల్ నందు చేసిన తరువాత మాత్రమే 2025-26 వర్క్ మొదలు పెట్టవలెను.

 స్టెప్ - 1 (సెట్ లొకేషన్ చేసుకోవాలి)
స్టెప్ - 2 (డేటా ఎంట్రీ లో - ప్రొఫైల్ ఎంట్రీ సెలెక్ట్ చేయాలి)
స్టెప్ - 3 (Financial Year  దగ్గర 2025-26 ని సెలెక్ట్ చేసుకోవాలి)


స్టెప్ - 4 (
గ్రామ / వార్డ్ పాపులేషన్, టార్గెట్ ని నమోదు చేయాలి)


2. Update EC Status: 

  • RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు Active లో ఉంచి మిగతా వారిని inactive లేదా not eligible చేసుకోవాలి. 
  • ఇలా చేసుకోవడం వలన మీ గ్రామ, వార్డ్ నందు టార్గెట్ కపుల్స్ మాత్రమే ఉంటారు కాబట్టి గర్భవతులను గుర్థించుట శులభం అవుతుంది. 

స్టెప్ - 1 (డేటా ఎంట్రీ లో - అప్డేట్ EC స్టేటస్ క్లిక్ చేసుకోవాలి)

స్టెప్ - 2 (EC సెర్చ్ చేసుకోవాలి)

స్టెప్ - 3 (డేటా ఎంట్రీ లో - అప్డేట్ EC స్టేటస్ క్లిక్ చేసుకోవాలి)
 
ముందుగా అర్హులైన దంపతుల సర్వే నిర్వహించి వివరములు సిద్ధం చేసుకోవాలి. 
వాటిలో ఈ క్రింది 3 రకాలుగా వివరములు  సిద్ధం చేసుకోవాలి.
Active EC: గర్భవతి అవడానికి అవకాశం ఉన్న దంపతులు 
inActive EC: ప్రస్తుతం కాకుండా ఎప్పటికైనా గర్భవతి అగు అవకాశం ఉన్నవారు. 
Not Eligible:  గర్భవతి అవడానికి అవకాశంలేని వారు. 

Active EC లను 01.04.2024 తేదీ వేసి అప్డేట్ చేయవలెను 
 
inActive EC లను కారణం నమోదు చేసి అప్డేట్ చేయవలెను
 
Not Eligible లను కారణం నమోదు చేసి అప్డేట్ చేయవలెను
 

3. EC Shift in 2025-26 Update:

  • RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు ప్రతి ఒక్క EC ని వాటి యొక్క RCH ID తో ఓపెన్ చేసి ఈ క్రింది వాటిని అప్డేట్ చేసి "సేవ్ (Save)" మాత్రమే చేయవలెను. 
    • EC పేరుని ఆధార్ లో ఉన్న విధంగా మార్చుకోవడం. 
    • మొబైల్ నెంబర్ మార్పు ఉంటె అప్డేట్ చేయడం. 
    • రిజిస్ట్రేషన్ తేదీ వద్ద 01.04.2025 తేదీతో మార్చడం. 
    • EC యొక్క ప్రస్తుత వయస్సు  సరిచేసుకోవడం. 
    • వారికీ ఇప్పటికే ఉన్న పిల్లల వివరములు.  
    •  
Note : EC data Update లో రిజిస్ట్రేషన్ డేట్ మార్చడం తప్పనిసరి కాదు కానీ అర్హులైన వారిని అందరిని ఈ సంవత్సరం లోకి మార్చడం వలన మన దగ్గర ఉన్న జీరో, ఒకటి, ఇద్దరు మరియు అంతకు మించి పిల్లలు ఉన్న దంపతుల వివరములు సులభంగా తెలుసుకోవచ్చును. 



 4. EC Re-Registration : 

  • RCH Portal లో కాన్పు అయిన, అబార్షన్ అయిన గర్భిణీ లను కాన్పు అయ్యి 42 రోజులు నిండిన వారిని గర్భవతి అవడానికి అవకాశం ఉన్న వారిని అర్హులైన దంపతులలోకి తీసుకు రావలెను. 
  • కాన్పు అయ్యి PNC చెక్-అప్ కొట్టని వాటిని all అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి search చేసి వచ్చిన పేర్లకు 01.04.2025 తేదీ తో సేవ్ చేయవలెను. 
  • అబార్షన్ అయిన 42 రోజులు నిండిన వారిని  Abortion అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి RCH ID తో search చేసి 01.04.2025 తేదీ తో సేవ్ చేయవలెను.  
  • కాన్పు అయ్యి PNC చెక్-అప్ కొట్టి 42 రోజులు నిండిన వారిని వాటిని Delivery + 42 Days అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి RCH ID తో search చేసి 01.04.2025 తేదీ తో సేవ్ చేయవలెను.  
 


💥 Village ప్రొఫైల్ ని 2025-26 కి నమోదు తప్పనిసరిగా పూర్తి చేయాలి. 

💥 ప్రతి ఎలిజిబుల్ కపుల్ (EC) కి తప్పనిసరిగా ABHA తో నమోదు చేసుకోవాలి (లింక్ చేసుకోవాలి). 

💥 ప్రతి గర్భవతికి తప్పనిసరిగా ABHA తో నమోదు చేసుకోవాలి (లింక్ చేసుకోవాలి). 

💥 డూప్లికేట్ నమోదు చేసిన ఎవరైతే ముందుగా ABHA చేస్తారో వారికీ మాత్రమే ఆ బెనిఫిషరీ ఉండి మిగతావి డిలీట్ అయిపోతాయి. 

💥 EC / ANC / Delivery మరియు వారికీ అందించిన సేవలు నమోదు చేయడానికి 3 రోజుల లోపు మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి నెలలు నెలలు పెండింగ్ లేకుండా 3 రోజుల లోపు మాత్రమే నమోదు చేయాలి. 

పైన తెలిపిన 4 పనులను తప్పనిసరిగా ప్రతి ఆరోగ్య కార్యకర్త ఏప్రిల్ నెల మొదటి వారము లోపు పూర్తి చేసుకోవలెను.  
 
RCH పోర్టల్ లో పైన తెలిపిన వర్క్ పూర్తి చేసిన తరవాత తప్పనిసరిగా ANMOL అప్లికేషన్ ని logout చేసి మరల లాగిన్ చేయవలెను. అప్పుడు మీ పూర్తి డేటా మీ TAB లో ANMOL లో కనిపిస్తుంది.

 
 
వీడియో కొరకు : RCH ANMOL - YouTube

 
 
RCH పోర్టల్ / ANMOL ఎలా ఉపయోగించాలి అనే పూర్తి  వివరాల కొరకు 

22, మార్చి 2025, శనివారం

ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారా.. ఇంట‌ర్ త‌ర్వాత ...


ఇంటర్ ఎంపీసీ పూర్తి చేశారా..  

ఇంట‌ర్ త‌ర్వాత ...

ఇంటర్మీడియట్ MPC (గణితం, భౌతిక శాస్త్రం మరియు రసాయన శాస్త్రం) పూర్తి చేసిన తర్వాత, మన పిల్లలు ఇంజనీరింగ్ (BE/BTech), ఆర్కిటెక్చర్ (BArch), సైన్స్ డిగ్రీలు (BSc) లేదా BCA వంటి కంప్యూటర్ సైన్స్ సంబంధిత రంగాలతో చదివేందుకు  వివిధ కోర్సులు ఉన్నాయి 

@కోర్సుల వివరాలు 

  1. ఇంజనీరింగ్ (BE/BTech): ఇందులో అనేక స్పెషలైజేషన్లు అందుబాటు లో ఉన్నాయి. 
  2. ఆర్కిటెక్చర్ (BArch): డిజైన్ మరియు ప్రాదేశిక ప్రణాళికపై ఆసక్తి ఉంటే, ఇది సరైన ఎంపిక. 
  3. సైన్స్ డిగ్రీలు (BSc): గణితం, ఫిజిక్స్, కెమిస్ట్రీ లేదా కంప్యూటర్ సైన్స్ వంటి వివిధ రంగాలలో BScని అభ్యసించవచ్చు. 
  4. కంప్యూటర్ సైన్స్ (BCA, ITలో BSc): సాఫ్ట్‌వేర్ డెవలప్‌మెంట్ మరియు IT పట్ల ఆసక్తి ఉంటే, ITలో BCA లేదా BSc మంచి ఎంపికలు కావచ్చు. 


@ ఇతర ఎంపికలు:

  1. మర్చంట్ నేవీ కోర్సులు: 
  2. బ్యాచిలర్ ఆఫ్ ఫార్మసీ (బి. ఫార్మా): 
  3. బ్యాచిలర్ ఆఫ్ కంప్యూటర్ అప్లికేషన్స్ (BCA): 
  4. హాస్పిటాలిటీ & ట్రావెల్‌లో బ్యాచిలర్ ఆఫ్ సైన్స్: 
  5. బ్యాచిలర్ ఆఫ్ జర్నలిజం & మాస్ కమ్యూనికేషన్ (BJMC): 
  6. బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (BFA): 
  7. బ్యాచిలర్ ఆఫ్ డిజైన్ (BDes): 


@ ఎంపీసీ తర్వాత ఉన్న మంచి అవకాశాలు 


ఇంటర్ ఎంపీసీ విద్యార్థులు చాలా మంది ఇంజనీరింగ్ కోర్సులో చేరడాన్ని లక్ష్యంగా పెట్టుకుంటారు. దీనికోసం ఈఏపీసెట్‌, జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ వంటి పరీక్షలపై దృష్టిసారిస్తారు. ఈఏపీసెట్‌ సీటు పొందడం తేలికే అయినా, జేఈఈలో ప్రతిభ కనబరిచి, ఉన్నత ఇంజనీరింగ్ విద్యా సంస్థల్లో ప్రవేశం లభించడం కష్టమే. పరిమిత సంఖ్యలో సీట్లు ఉండటం, పోటీ లక్షల లో ఉండటమే దీనికి కారణం.

అయితే వీటికి దీటుగా మరెన్నో ప్రతిష్టాత్మక సంస్థలు అందుబాటులో ఉన్నాయి. విద్యతో పాటు ఉపాధిని పొందే మార్గాలూ ఉన్నాయి. లక్ష్యం ఇంజనీరింగ్.. గమ్యం సుస్థిర కెరీర్. ఈ రెండిటికీ మార్గం వేసేలా ఇటు బీటెక్ పట్టా.. అటు ప్రభుత్వ ఉద్యోగాన్ని పొందే అవకాశాలున్నాయి.


@ఎన్‌డీఏ (ఎన్‌ఏ) ఎగ్జామినేషన్ 2025 :

త్రివిధ దళాల్లో పర్మనెంట్ కమిషన్ స్థాయి ఉద్యోగం పొందేందుకు నేషనల్ డిఫెన్స్ అకాడమీ (నేవల్ అకాడమీ) ఎగ్జామినేషన్ వీలుకల్పిస్తోంది. ఇంటర్మీడియెట్ అర్హతతో యూపీఎస్సీ ఈ పరీక్ష నిర్వహిస్తోంది. దీని ద్వారా ఇండియన్ ఆర్మీ, నేవీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలకు అభ్యర్థులను ఎంపిక చేస్తారు. నేవల్ అకాడమీ, ఎయిర్‌ఫోర్స్ విభాగాలకు ఎంపికైన వారికి నిర్ణీత వ్యవధిలో శిక్షణ ఇస్తారు. దీన్ని విజయవంతంగా పూర్తిచేస్తే నేవల్ అకాడమీ విద్యార్థులకు నేవల్ ఆర్కిటెక్చర్‌లో బీటెక్ డిగ్రీ కూడా లభిస్తుంది. ఆర్మీ, ఎయిర్‌ఫోర్స్ ఔత్సాహికులకు బీఎస్సీ, బీఏ సర్టిఫికెట్లు అందిస్తారు. యూపీఎస్సీ ఈ పరీక్షను ఏటా రెండు సార్లు నిర్వహిస్తుంది.వెబ్‌సైట్: www.upsc.gov.in


@ స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్ 2025 :

భారతీయ రైల్వే మెకానికల్ విభాగంలో ఇంజనీర్ ఉద్యోగం పొందడానికి ఇది ఉత్తమ మార్గం. దీనికి ముందుగా బిట్స్-మెస్రా నుంచి బీటెక్ (మెకానికల్) సర్టిఫికెట్ సొంతం చేసుకునేందుకు స్పెషల్ క్లాస్ రైల్వే అప్రెంటీస్ ఎగ్జామినేషన్ వీలుకల్పిస్తుంది. ఈ పరీక్షకు అర్హత 50 శాతం మార్కులతో ఇంటర్మీడియెట్ ఉత్తీర్ణత. గతేడాది వరకు ఈ పరీక్షను యూపీఎస్సీ నిర్వహించేది. కానీ ఈ ఏడాది నుంచి ఎస్‌సీఆర్‌ఏ నిర్వహణ తమకు కష్టమని యూపీపీఎస్సీ పేర్కొంది. దీంతో పరీక్షను స్వయంగా రైల్వే శాఖ నిర్వహించే అవకాశాలు ఉన్నాయి. 

రాత పరీక్షలో మూడు పేపర్లు (జనరల్ నాలెడ్జ్/సైకాలజీ టెస్ట్; ఫిజికల్ సెన్సైస్; మ్యాథమెటిక్స్) ఉంటాయి. తర్వాత ఇంటర్వ్యూలో ప్రతిభ ఆధారంగా తుది జాబితా రూపొందిస్తారు.

@ 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం 2025 :

ఇండియన్ ఆర్మీలో ఉద్యోగంతో పాటు ఎలక్ట్రానిక్స్, మెకానికల్, టెలీ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో బీటెక్ పట్టా పొందేందుకు మార్గం ఇండియన్ ఆర్మీ.. 10+2 టెక్నికల్ ఎంట్రీ స్కీం. ఇంటర్ ఎంపీసీలో 70 శాతం మార్కులు పొందిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. రాత పరీక్ష ఉండదు. నేరుగా ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ప్రక్రియ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన వారికి ఇండియన్ మిలిటరీ అకాడమీ (డెహ్రాడూన్), ఇండియన్ మిలిటరీ కాలేజీలు (పుణె, సికింద్రాబాద్)ల్లో శిక్షణ ఇస్తారు. దీన్ని పూర్తిచేసిన వారికి సంబంధిత బ్రాంచ్‌లో బీటెక్ సర్టిఫికెట్‌తో పాటు లెఫ్టినెంట్ హోదాతో ఆర్మీలో ఉద్యోగం ఇస్తారు.

వెబ్‌సైట్: www.indarmy.nic


@ ఇండియన్ నేవీ.. 10+2 క్యాడెట్ (బీటెక్) ఎంట్రీ స్కీం 2025 :

బీటెక్ పట్టాను అందించడంతో పాటు నేవీలో సబ్ లెఫ్టినెంట్ హోదాలో కెరీర్‌ను సుస్థిరం చేసేందుకు ఇండియన్ నేవీ.. 10+2 క్యాడెట్(బీటెక్) ఎంట్రీ స్కీం వీలుకల్పిస్తోంది. దీనికి ఇంటర్ ఎంపీసీలో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులు. ఎస్‌ఎస్‌బీ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు ఇండియన్ నేవల్ అకాడమీలో బీటెక్ ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్స్/మెకానికల్/ నేవల్ ఆర్కిటెక్చర్/ మెరైన్ ఇంజనీరింగ్ బ్రాంచ్‌ల్లో శిక్షణ ఉంటుంది. శిక్షణ పూర్తి చేశాక సబ్ లెఫ్టినెంట్ హోదాతో కెరీర్ సొంతమవుతుంది

.వెబ్‌సైట్: www.nausenabharti.nic.in


@ ఇంటర్ ఎంపీసీ తర్వాత ప్రవేశ పరీక్షలు 2025

1) ఐఐఎస్‌ఈఆర్ ఆప్టిట్యూడ్ టెస్ట్ 2025 

:ఇంటర్ ఎంపీసీ తర్వాత.. సైన్స్ విభాగంలో ఉన్నత కెరీర్‌ను ఆశించే వారికి సమున్నత వేదిక ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (ఐఐఎస్‌ఈఆర్). దీనికి దేశవ్యాప్తంగా ఏడు క్యాంపస్‌లు ఉన్నాయి. ఐఐఎస్‌ఈఆర్‌లో ఎంపీసీ, బైపీసీ అర్హతతో అయిదేళ్ల బీఎస్-ఎంఎస్ కోర్సు అందుబాటులో ఉంది. ఇందులో ప్రవేశానికి జేఈఈ అడ్వాన్స్‌డ్ ర్యాంకు లేదా కేవైపీవైలో ఉత్తీర్ణత లేదా ఐఐఎస్‌ఈఆర్ నిర్వహించే ఆప్టిట్యూడ్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాలి. ఈ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత సాధించి కోర్సులో ప్రవేశం పొందితే రీసెర్చ్ పరంగా ఉన్నత అవకాశాలు లభిస్తాయి

.వెబ్‌సైట్: www.iiseradmissions.in

2) నాటా 2025 :

ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థులకు.. నేషనల్ ఆప్టిట్యూడ్ టెస్ట్ ఇన్ ఆర్కిటెక్చర్ (నాటా) ప్రవేశ పరీక్షలో ర్యాంకు ఆధారంగా కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ పరిధిలోని స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్, ఇతర అనుబంధ ఆర్కిటెక్చర్ కళాశాలల్లో బ్యాచిలర్ ఆఫ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ కోర్సులో ప్రవేశం లభిస్తుంది.

 వెబ్‌సైట్: www.nata.in

3)బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ :

ఇంట‌ర్ ఎంపీసీ విద్యార్థులకు కెరీర్ పరంగా అందుబాటులో ఉన్న అద్భుత ప్రత్యామ్నాయం బ్యాచిలర్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (బి.ఎఫ్‌టెక్). నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫ్యాషన్ టెక్నాలజీ (నిఫ్ట్) క్యాంపస్‌ల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఔత్సాహిక అభ్యర్థులు నిఫ్ట్-అడ్మిషన్ టెస్ట్‌లో ఉత్తీర్ణత సాధించాల్సి ఉంటుంది.

వెబ్‌సైట్: www.nift.ac.in

4) బిట్‌శాట్ 2025 : 

బీటెక్ చేయాలనుకునే ఇంటర్మీడియెట్ విద్యార్థులకు మరో చక్కటి ప్రత్యామ్నాయం బిట్‌శాట్. బిర్లా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (బిట్స్)కు చెందిన మూడు క్యాంపస్‌ల్లో బీటెక్ కోర్సుల్లో ప్రవేశానికి బిట్‌శాట్ నిర్వహిస్తారు. పిలానీ, గోవా, హైదరాబాద్ క్యాంపస్‌ల్లో కెమికల్, సివిల్, కంప్యూటర్‌సైన్స్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ తదితర బ్రాంచ్‌ల్లో బీటెక్ చేయొచ్చు. బీటెక్ పూర్తయ్యాక ఇన్‌స్టిట్యూట్ క్యాంపస్‌ల్లో ఎంటెక్ చేసేందుకు ప్రత్యేక సదుపాయాలు అందుబాటులో ఉన్నాయి.

వెబ్‌సైట్: www.bitsadmission.com


@ ఇతర కోర్సులు ..

బైపీసీ విద్యార్థులకే కాకుండా ఎంపీసీ విద్యార్థులకు కూడా ఫార్మాస్యూటికల్ రంగంలో కెరీర్ అవకాశాలను అందిపుచ్చుకునేందుకు అవకాశముంది. 

బీ ఫార్మసీ సీట్లలో 50 శాతం సీట్లను ఎంపీసీ అర్హతతో, ఈఏపీసెట్ ర్యాంకు ఆధారంగా కౌన్సెలింగ్ ద్వారా భర్తీ చేస్తున్నారు. 

ఉన్నత విద్య, కెరీర్ పరంగా చూస్తే బీ ఫార్మసీకి ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతోంది. ఫార్మా రంగంలో ఎఫ్‌డీఐలు వస్తుండటం, స్వదేశీ ఫార్మాస్యూటికల్ సంస్థల విస్తరణతో ఉద్యోగ అవకాశాలు పెరుగుతున్నాయి. ఉన్నత విద్య కోణంలో చూస్తే పీజీ స్థాయిలో ఫార్మకోగ్నసీ, ఫార్మా మేనేజ్‌మెంట్ తదితర స్పెషలైజేషన్లు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేస్తే, ఫార్మాస్యూటికల్ సంస్థల్లో ఉన్నత హోదాలు అందుకోవచ్చు.

@ హోటల్ మేనేజ్‌మెంట్ రంగంలో..

కెరీర్ పరంగా మరో ఉన్నత విభాగం హోటల్ మేనేజ్‌మెంట్ అండ్ క్యాటరింగ్ టెక్నాలజీ. కేంద్ర పర్యాటక శాఖ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్స్ ఆఫ్ హోటల్ మేనేజ్‌మెంట్‌లలో ఈ కోర్సు చేస్తే భవిష్యత్తు ఉజ్వలంగా ఉంటుంది. దీనికోసం ఏటా జాతీయ స్థాయిలో నేషనల్ కౌన్సిల్ ఫర్ హోటల్ మేనేజ్‌మెంట్ జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్‌ను నిర్వహిస్తారు.

@ న్యాయశాస్త్రంలో అవకాశాలు ....

.ఒకప్పుడు న్యాయ శాస్త్రం అంటే హెచ్‌ఈసీ, సీఈసీ విద్యార్థులకే అనుకూలం అనే భావన ఉండేది. కానీ, పరిస్థితులు మారాయి. అన్ని విద్యా నేపథ్యాల విద్యార్థులకు కెరీర్ పరంగా న్యాయశాస్త్రం అద్భుత వేదికగా నిలుస్తోంది. లా కోర్సులు పూర్తిచేసిన వారికి కార్పొరేట్ కొలువులు లభిస్తున్నాయి. ఈ అవకాశాలను ఎంపీసీ విద్యార్థులు సైతం ఒడిసిపట్టుకోవచ్చు. ఇంటర్మీడియెట్ అర్హతతో అయిదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశం పొందొచ్చు. దీనికోసం రాష్ట్ర స్థాయిలో నిర్వహించే లాసెట్‌లో ర్యాంకు సాధించాలి. నల్సార్ యూనివర్సిటీ ఆఫ్ లా, నేషనల్ లా యూనివర్సిటీలు వంటి ప్రతిష్టాత్మక సంస్థల్లో ప్రవేశం పొందాలంటే జాతీయ స్థాయిలో నిర్వహించే కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)లో ప్రతిభ చూపాలి.

వెబ్‌సైట్: www.clat.ac.in

18, మార్చి 2025, మంగళవారం