My Pages

9, ఏప్రిల్ 2023, ఆదివారం

EC Update Status | RCH పోర్టల్ లో అవసరం ఉన్న EC మాత్రమే ఉండేలా ఏమి చేయాలి


Update EC Status: 

  • RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు Active లో ఉంచి మిగతా వారిని inactive లేదా not eligible చేసుకోవాలి. 
  • ఇలా చేసుకోవడం వలన మీ గ్రామ, వార్డ్ నందు టార్గెట్ కపుల్స్ మాత్రమే ఉంటారు కాబట్టి గర్భవతులను గుర్థించుట శులభం అవుతుంది. 
స్టెప్ - 1 (డేటా ఎంట్రీ లో - అప్డేట్ EC స్టేటస్ క్లిక్ చేసుకోవాలి)
స్టెప్ - 2 (EC సెర్చ్ చేసుకోవాలి)
స్టెప్ - 3 (డేటా ఎంట్రీ లో - అప్డేట్ EC స్టేటస్ క్లిక్ చేసుకోవాలి)
 
ముందుగా అర్హులైన దంపతుల సర్వే నిర్వహించి వివరములు సిద్ధం చేసుకోవాలి. 
వాటిలో ఈ క్రింది 3 రకాలుగా వివరములు  సిద్ధం చేసుకోవాలి.
Active EC: గర్భవతి అవడానికి అవకాశం ఉన్న దంపతులు 
inActive EC: ప్రస్తుతం కాకుండా ఎప్పటికైనా గర్భవతి అగు అవకాశం ఉన్నవారు. 
Not Eligible:  గర్భవతి అవడానికి అవకాశంలేని వారు. 

Active EC లను 01.04.2023 తేదీ వేసి అప్డేట్ చేయవలెను 
 
inActive EC లను కారణం నమోదు చేసి అప్డేట్ చేయవలెను
 
Not Eligible లను కారణం నమోదు చేసి అప్డేట్ చేయవలెను
 

23, మార్చి 2023, గురువారం

RCH Portal | ANC & Child Migrate చేయడం ఎలా ?

💥 RCH పోర్టల్ లో Migrate చేయడం ఎలా ?
💥 Migrate చేసిన వాటిని సర్వీసెస్ అందించడం ఎలా ?
💥 Migrate చేసిన వాటిని Delivery నమోదు చేయవచ్చా ?
💥 RCH ID తెలియకపోతే Migrate చేయడం ఎలా ?


8, మార్చి 2023, బుధవారం

అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు | మహిళలు ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు

 అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు | మహిళలు ప్రత్యేక సౌలభ్యాలు- సెలవులు

👑ప్రభుత్వ ఉద్యోగాల్లో మహిళలకు 33% రిజర్వేషన్లు కల్పిస్తూ సబార్డినేట్ సర్వీసు రూల్సు లోని నిబంధన 22 ద్వారా వెసులుబాటు కల్పించినది.

(G.O.Ms.No.237,GAD తేది:28-05-1996)

(ఇది మహిళా ఉద్యోగులకు చరిత్రలో నిలిచిపోయే G.O.)

💁‍♀️ ఉద్యోగ కల్పనకు సంబంధించి మహిళల పట్ల అమలౌతున్న వివక్షను నిర్మూలించడానికి, ఉద్యోగ కల్పనలో సమానత్వం సాధించడానికి ఉద్దేశించిన మార్గదర్శకాలు.

(G.O.Ms.No.27 తేది:09-01-2004)

💁‍♀️ మరణించిన ప్రభుత్వ ఉద్యోగి వివాహిత కుమార్తేకు కారుణ్య నియామక పథకం ద్వారా ఉద్యోగం కల్పిస్తారు.

(G.O.Ms.No.350 తేది:30-07-1999) 

💁‍♀️ అవివాహిత ప్రభుత్వ ఉద్యోగి మరణించిన సందర్భంలో ఆ ఉద్యోగి మీద ఆధారపడిన చెల్లెలుకు కారుణ్య నియామకం ద్వారా ఉద్యోగ అవకాశం.

(Memo.No.17897 తేది:20-04-2000)

💁‍♀️ పనిస్థలాల్లో మహిళా ఉద్యోగుల పట్ల లైంగిక వేధింపులను నిషేధిస్తూ ఉత్తర్వులు.

(G.O.Ms.No.322 GAD తేది:19-07-1995)

💁‍♀️ ఎస్.ఎస్.సి సర్టిఫికేట్ లో తండ్రి పేరుతో పాటు తల్లిపేరు చేర్చు ఉత్తర్వులు. 

(మెమో.నం.7679 తేది:14-09-2010)

💁‍♀️ మార్చి 8న మహిళా దినోత్సవం రోజున మహిళా ఉద్యోగులకు స్పెషల్ సి.ఎల్ మంజూరు.

(G.O.Ms.No.433 GAD తేది:4-8-2010)

💁‍♀️ మహిళా ఉపాధ్యాయులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.

(G.O.Ms.No.374 తేది:16-03-1996)

💁‍♀️ జూనియర్  లెక్చరర్లకు 5 రోజుల అదనపు సెలవుల మంజూరు.

(G.O.Ms.No.03 తేది:05-01-2011)

💁‍♀️ మహిళా ఉద్యోగులకు 5 రోజుల అదనపు సెలవు మంజూరు.

(G.O.Ms.No.142 తేది:01-09-2018)


💁‍♀️ వివాహం ఐన మహిళా ఉద్యోగికి 180 రోజులు జీతం తో కూడిన ప్రసూతి  సెలవు మంజూరు చేయబడుతుంది.

(G.O.Ms.No.152 తేది:04-05-2010)

💁‍♀️ మహిళా ఉద్యోగులు ట్యూబెక్టమి ఆపరేషన్ చేయించుకున్న సందర్భంలో వారికి పద్నాలుగు రోజులకు (14)మించకుండా ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.ఒకవేళ అట్టి ఆపరేషన్ ఏ కారణంచేతనైన ఫలించనియెడల మెడికల్ అధికారి సర్టిఫికెట్ ఆధారంగా మరల పద్నాలుగు(14) రోజులు మంజూరుచేయవచ్చు.

(G.O.Ms.No.1415 M&H తేది:10-06-1968)

(G.O.Ms.No.124 F&P తేది:13-04-1982)

💁‍♀️ మహిళా ఉపాధ్యాయులు గర్భనిరోధక సాధనం(LOOP) అమర్చుకున్నరోజు ఒక(1) రోజు ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.128 F&P తేది:13-04-1982)

💁‍♀️ ఇద్దరికంటే తక్కువ పిల్లలున్నప్పుడు,ఆపరేషన్ తరువాత మగ,ఆడ పిల్లలందరూ చనిపోయినపుడు రీకానలైజేషన్ చేయించుకునే మహిళా ఉద్యోగికి 21 రోజులు లేదా అవసరమైన రోజులు ఏది తక్కువైతే ఆమేరకు మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.102 M&H తేది:19-02-1981)

💁‍♀️ మహిళా ఉద్యోగి హిస్టరెక్టమి ఆపరేషన్(గర్భసంచి తొలగింపు) శస్త్రచికిత్స చేయించుకున్న సందర్భంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్ సిఫారసుమేరకు 45 రోజుల ప్రత్యేక ఆకస్మిక సెలవు మంజూరుచేస్తారు.

(G.O.Ms.No.52 F&P తేది:01-04-2011)

💁‍♀️ చట్టబద్దంగా గాని,అప్రయత్నంగా గాని గర్భస్రావం(Abortion) జరిగినచో 6 వారాల సెలవు మంజూరు చేయబడును.

(G.O.Ms.No.762 M&H తేది:11-08-1976)

💁‍♀️ మహిళా ఉద్యోగులు,టీచర్లకు వారి  మొత్తం సర్వీసులో 180 రోజులు శిశుసంరక్షణ సెలవు మంజూరు.

(G.O.Ms.No.199 తేది:19-10-2022)

24, ఫిబ్రవరి 2023, శుక్రవారం

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, to MR-1,2 వాక్సిన్ 24.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 24.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి


🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List upto MR-1


19, ఫిబ్రవరి 2023, ఆదివారం

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG to MR-1,2 వాక్సిన్ 19.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్

 

Palnadu పట్టణ, గ్రామ సచివాలయం ANMs వారీగా BCG, OPV, Hep-B (0), Penta-1,2,3, Rota-1,2,3, PCV-1,2,B, IPV-1,2, MR-1,2 వాక్సిన్ 19.02.2023 నాటికి పెండింగ్ ఉన్న లిస్ట్ కొరకు ఈ క్రింది లింక్ ద్వారా చూడండి


🎁👇New Pending Update👇🎁

💥 Vaccine Pending List upto MR-1


ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ | Krishna |

  Final Seniority List Available 👇👇 ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి సీనియారిటీ లిస్ట్ లో సమస్యల పరిస్కారం తదు...