RCH 2.0 Work Process Presentation 👇
RCH ANMOL TECH
Medical & Health Department Related Topics Data for Health Services in Field Level
17, ఆగస్టు 2025, ఆదివారం
26, జూన్ 2025, గురువారం
23, జూన్ 2025, సోమవారం
గ్రామ వార్డు సచివాలయంలో నేటివ్ మండల బదిలీ పైన వచ్చిన క్లారిటీ
గ్రామ వార్డు సచివాలయంలో నేటివ్ మండల బదిలీ పైన వచ్చిన క్లారిటీ
పట్టణం లో మాత్రమే నేటివ్ వార్డు నుంచి పక్క వార్డు లోని సచివాలయానికి మారవచ్చు
రూరల్ వారు తప్పనిసరిగా పక్కా మండలానికి మరవలసిందే.
4, జూన్ 2025, బుధవారం
MPHA ( F) బదిలీ నేపథ్యంలో కొన్ని ప్రత్యేక సూచనలు – ఉత్తర్వులు జారీ.
👉Transfer Application Form
---
ఆరోగ్య కుటుంబ సంక్షేమ కమిషనర్ కార్యాలయం:: ఏపీ :: మంగళగిరి
Rc.No.2851586/HMF04-11021(31)/ 68/ 2025-EST SEC-CHFW తేదీ: 04-06-2025
విషయం:
ఆరోగ్య కుటుంబ సంక్షేమ – ఉద్యోగుల బదిలీలు మరియు పోస్టింగ్‌లు – రెగ్యులర్ ఉద్యోగుల బదిలీలకు సంబంధించిన మార్గదర్శకాలు తెలియజేత – MPHA (F) కేడర్ సంబంధించి బదిలీ నిషేధం ఎత్తివేయబడిన నేపథ్యంలో కొన్ని ప్రత్యేక సూచనలు – ఉత్తర్వులు జారీ.
సూచనలు:
1. పై సూచనల ఆధారంగా జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారులు (DM&HOలు) MPHA (F) బదిలీలను కింది విధంగా చేపట్టాలి:
✅ సాధారణ మార్గదర్శకాలు:
1. జిల్లా కేంద్రాల్లో బదిలీలను పారదర్శకంగా, పరిపాలన పరంగా సమర్థవంతంగా నిర్వహించేందుకు కింది క్రమాన్ని పాటించాలి:
స్పష్ట ఖాళీలు (Clear Vacancies) అంటే:
PHC ప్రధాన కార్యాలయం/సబ్ సెంటర్ ఖాళీలు – ప్రస్తుతం ఉద్యోగి లేని పోస్టులు
విల్లేజ్ హెల్త్ క్లినిక్స్ (VHCs) కలిసిన సబ్ సెంటర్లు – సిబ్బంది లేని ఖాళీలు
పై రెండు రకాలే స్పష్ట ఖాళీలుగా పరిగణించాలి. ఇతర ఖాళీలు స్పష్ట ఖాళీలుగా పరిగణించరాదు.
2. ఐదేళ్లు పూర్తి చేసిన ఉద్యోగులను తప్పనిసరిగా బదిలీ చేయాలి – వారు ఎక్కడైనా ఐదేళ్లు ఆపాదించిన సేవ గణనలోకి తీసుకోవాలి.
3. 2025 మే 31 నాటికి రెండు సంవత్సరాల సర్వీస్ పూర్తి చేసిన వారు మాత్రమే అభ్యర్థన బదిలీలకు అర్హులు.
4. 5 సంవత్సరాల స్టేషన్ సీనియారిటీ కలిగి, దర్యాప్తు / ఏసీబీ / విజిలెన్స్ కేసులు ఉన్నవారు – వారికి నాన్ ఫోకల్ పోస్టులో బదిలీ ఇవ్వాలి.
5. ఇతర విభాగాలకు / కార్యాలయాలకు నియమించబడిన MPHA (F) – వారి జీతాలు ఎక్కడ నుంచి వస్తున్నాయో అదే స్టేషన్ బదిలీ కోసం పరిగణించాలి. వారికి బదిలీ కావాలంటే అభ్యర్థన అవసరం. లేనిచో, వారు అదే స్థలంలో కొనసాగించాలి.
6. బదిలీ కోరుతున్న ఉద్యోగులు 5 ప్రాధాన్యత స్థలాలు ఇవ్వాలి. ఒక స్థలానికి ఎక్కువమంది కోరితే, స్టేషన్ సీనియారిటీ ఆధారంగా నిర్ణయం తీసుకోవాలి. ఎవరైనా ఎంపిక చేయకపోతే ఖాళీల ఆధారంగా పోస్టింగ్ ఇవ్వబడుతుంది. ప్రతి గ్రామీణ ఆరోగ్య కేంద్రం మరియు హెడ్ క్వార్టర్ సబ్ సెంటర్లో కనీసం ఒక MPHA (F) ఉండేలా చూడాలి.
7. పై విధానాల ప్రకారం బదిలీ అయిన ఉద్యోగులు 23.06.2025 నాటికి తొలగించబడ్డవారిగా పరిగణించబడతారు.
8. ప్రతి సబ్ సెంటర్ మరియు గ్రామ/వార్డ్ సెక్రటేరియట్‌లో కనీసం ఒక MPHA (F) లేదా ANM Grade III ఉండాలి – ప్రజారోగ్య సేవల్లో అంతరాయం కలగకుండా ఉండేందుకు ఇది తప్పనిసరి.
29, మే 2025, గురువారం
RCH 2.0 Work Videos | RCH 2.0 లో ఎలా పని చేయాలి పూర్తి వీడియోస్
RCH 2.0 లో ఎలా పని చేయాలి పూర్తి వీడియోస్
15, ఏప్రిల్ 2025, మంగళవారం
RCH Portal 2025-26 సూచనలు | ANMs అందరు తప్పక పాటించవలసిన సూచనలు | April 2025 Instructions
RCH Portal Instructions 2025 - 26
- RCH Portal లో Village ని సెట్ లొకేషన్ చేసి తప్పనిసరిగా ఏప్రిల్ 1 వ తేదీన Village ప్రొఫైల్ నందు Financial Year దగ్గర 2025-26 ని సెలెక్ట్ చేసుకోవాలి.
- Village ప్రొఫైల్ నందు ANM, ASHA & AWW ఎవరు సేవలు అందిస్తారో వారి పేర్లు సెలెక్ట్ చేసుకోవాలి.
- సెలెక్ట్ చేసిన తరువాత ఆ గ్రామ / వార్డ్ యొక్క పాపులేషన్, EC, ANC & Child సంవత్సరపు టార్గెట్ (ELA) ని నమోదు చేసి సేవ్ చేయాలి.
- ఆ గ్రామ / వార్డ్ దగ్గరగా ఉన్న ఆరోగ్యకేంద్రం వివరములు నమోదు చేయాలి.
- Village ప్రొఫైల్ నందు చేసిన తరువాత మాత్రమే 2025-26 వర్క్ మొదలు పెట్టవలెను.
స్టెప్ - 1 (సెట్ లొకేషన్ చేసుకోవాలి)స్టెప్ - 2 (డేటా ఎంట్రీ లో - ప్రొఫైల్ ఎంట్రీ సెలెక్ట్ చేయాలి)
స్టెప్ - 4 (గ్రామ / వార్డ్ పాపులేషన్, టార్గెట్ ని నమోదు చేయాలి)
స్టెప్ - 3 (Financial Year దగ్గర 2025-26 ని సెలెక్ట్ చేసుకోవాలి)
- RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు Active లో ఉంచి మిగతా వారిని inactive లేదా not eligible చేసుకోవాలి.
- ఇలా చేసుకోవడం వలన మీ గ్రామ, వార్డ్ నందు టార్గెట్ కపుల్స్ మాత్రమే ఉంటారు కాబట్టి గర్భవతులను గుర్థించుట శులభం అవుతుంది.
ముందుగా అర్హులైన దంపతుల సర్వే నిర్వహించి వివరములు సిద్ధం చేసుకోవాలి.
వాటిలో ఈ క్రింది 3 రకాలుగా వివరములు సిద్ధం చేసుకోవాలి.
Active EC: గర్భవతి అవడానికి అవకాశం ఉన్న దంపతులు
inActive EC: ప్రస్తుతం కాకుండా ఎప్పటికైనా గర్భవతి అగు అవకాశం ఉన్నవారు.
Not Eligible: గర్భవతి అవడానికి అవకాశంలేని వారు.
Active EC లను 01.04.2024 తేదీ వేసి అప్డేట్ చేయవలెను
Not Eligible లను కారణం నమోదు చేసి అప్డేట్ చేయవలెను
3. EC Shift in 2025-26 Update:
- RCH Portal లో గర్భవతి అవడానికి అవకాశం ఉన్న అర్హులైన దంపతుల వరకు ప్రతి ఒక్క EC ని వాటి యొక్క RCH ID తో ఓపెన్ చేసి ఈ క్రింది వాటిని అప్డేట్ చేసి "సేవ్ (Save)" మాత్రమే చేయవలెను.
- EC పేరుని ఆధార్ లో ఉన్న విధంగా మార్చుకోవడం.
- మొబైల్ నెంబర్ మార్పు ఉంటె అప్డేట్ చేయడం.
- రిజిస్ట్రేషన్ తేదీ వద్ద 01.04.2025 తేదీతో మార్చడం.
- EC యొక్క ప్రస్తుత వయస్సు సరిచేసుకోవడం.
- వారికీ ఇప్పటికే ఉన్న పిల్లల వివరములు.
Note : EC data Update లో రిజిస్ట్రేషన్ డేట్ మార్చడం తప్పనిసరి కాదు కానీ అర్హులైన వారిని అందరిని ఈ సంవత్సరం లోకి మార్చడం వలన మన దగ్గర ఉన్న జీరో, ఒకటి, ఇద్దరు మరియు అంతకు మించి పిల్లలు ఉన్న దంపతుల వివరములు సులభంగా తెలుసుకోవచ్చును.
- RCH Portal లో కాన్పు అయిన, అబార్షన్ అయిన గర్భిణీ లను కాన్పు అయ్యి 42 రోజులు నిండిన వారిని గర్భవతి అవడానికి అవకాశం ఉన్న వారిని అర్హులైన దంపతులలోకి తీసుకు రావలెను.
- కాన్పు అయ్యి PNC చెక్-అప్ కొట్టని వాటిని all అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి search చేసి వచ్చిన పేర్లకు 01.04.2025 తేదీ తో సేవ్ చేయవలెను.
- అబార్షన్ అయిన 42 రోజులు నిండిన వారిని Abortion అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి RCH ID తో search చేసి 01.04.2025 తేదీ తో సేవ్ చేయవలెను.
- కాన్పు అయ్యి PNC చెక్-అప్ కొట్టి 42 రోజులు నిండిన వారిని వాటిని Delivery + 42 Days అనే ఆప్షన్ సెలెక్ట్ చేసి RCH ID తో search చేసి 01.04.2025 తేదీ తో సేవ్ చేయవలెను.
💥 Village ప్రొఫైల్ ని 2025-26 కి నమోదు తప్పనిసరిగా పూర్తి చేయాలి.
💥 ప్రతి ఎలిజిబుల్ కపుల్ (EC) కి తప్పనిసరిగా ABHA తో నమోదు చేసుకోవాలి (లింక్ చేసుకోవాలి).
💥 ప్రతి గర్భవతికి తప్పనిసరిగా ABHA తో నమోదు చేసుకోవాలి (లింక్ చేసుకోవాలి).
💥 డూప్లికేట్ నమోదు చేసిన ఎవరైతే ముందుగా ABHA చేస్తారో వారికీ మాత్రమే ఆ బెనిఫిషరీ ఉండి మిగతావి డిలీట్ అయిపోతాయి.
💥 EC / ANC / Delivery మరియు వారికీ అందించిన సేవలు నమోదు చేయడానికి 3 రోజుల లోపు మాత్రమే అవకాశం ఉంటుంది కాబట్టి నెలలు నెలలు పెండింగ్ లేకుండా 3 రోజుల లోపు మాత్రమే నమోదు చేయాలి.
పైన తెలిపిన 4 పనులను తప్పనిసరిగా ప్రతి ఆరోగ్య కార్యకర్త ఏప్రిల్ నెల మొదటి వారము లోపు పూర్తి చేసుకోవలెను.
RCH పోర్టల్ లో పైన తెలిపిన వర్క్ పూర్తి చేసిన తరవాత తప్పనిసరిగా ANMOL అప్లికేషన్ ని logout చేసి మరల లాగిన్ చేయవలెను. అప్పుడు మీ పూర్తి డేటా మీ TAB లో ANMOL లో కనిపిస్తుంది.
వీడియో కొరకు : RCH ANMOL - YouTube
RCH పోర్టల్ / ANMOL ఎలా ఉపయోగించాలి అనే పూర్తి వివరాల కొరకు
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
కామెంట్లు (Atom)
-
గ్రామ వార్డ్ సచివాలయం లో పని చేస్తున్న 1282 ANMs అందరు ప్రకటించిన లిస్ట్ లో అభ్యతరములు లేకపోయినా కూడా తప్పనిసరిగా ఈ క్రింద తెలిపిన తేదీలల...
-
https://rchanmoltech.blogspot.com/2024/10/anm-gr-iii-anm-gr-ii-mpha-f-provisonal.html ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చే...
-
ANM Gr - III నుంచి ANM Gr - II (MPHA-F) గా ప్రమోట్ చేయడానికి గుంటూరు జిల్లా లో మెరిట్ లిస్ట్ గుంటూరు లిస్ట్

















